Site icon Bhoomika Bharat News

విద్యార్థుల సూసైడ్ పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

భువనగిరి పట్టణంలో ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్న ఘటనపై తల్లిదండ్రులు ఆరుగురు పై ఫిర్యాదు చేసినట్టుగా సోమవారం సీఐ సురేష్ కుమార్ తెలిపారు.వాడిన చున్నీతో పాటు డోర్ బోల్టు సూసైడ్ నోటు మొత్తం మూడిటిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు మృతదేహాలపై చున్నికి సంబంధించిన గాయాలు తప్ప మరే గాయాలు లేవని పేర్కొన్నారు మృతదేహాలపై గాయాలు ఉన్నట్టుగా వస్తున్న సోషల్ మీడియాలో కథనాలపై అడగగా వారు ఈ సమాధానం ఇచ్చారు.ఘటనపై విద్యార్థుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ వేగవంతం చేస్తామన్నారు.

Exit mobile version